దినేష్ తేజ్ హీరోగా, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం అలా నిన్ను చేరి. మారేష్ శివన్ దర్శకత్వంలో కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్నారు. తొలి సీన్‌కి మందడి కిషోర్ రెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేయగా, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు క్లాప్ కొట్టారు. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న చిత్రమిది. డైరెక్టర్, కెమెరామేన్, గరుడవేగ అంజి, హుషారు ఫేమ్ తేజస్ పాల్గొన్నారు. సెప్టెంబర్ 5న షూటింగ్ ప్రారంభిస్తాం అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కర్నాటి రాంబాబు, సంగీతం : సుభాష్ ఆనంద్, కెమెరా: పీజీ విందా, పాటలు : చంద్రబోస్, ఆర్ట్ డైరెక్టర్ విఠల్.