సైన్యాన్ని బలోపేతం చేసేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అదనంగా 1,37,000 మందిని నియమించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నియామకాలతో కలిపి సాయుధ బలగాల మొత్తం సంఖ్య 20,39,758కు చేరుతుందని రక్షణశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని తీవ్రతరం చేసే ఉద్దేశంతోనే వాలంటీర్లు, ప్రైవేటు సైనికులు, ఖైదీలను సైన్యంలో నియమించేందుకు క్రెమ్లిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కాగా తూర్పు ఉక్రెయిన్‌లో సైనికులకు పరికరాలను తీసుకెళ్తున్న రైలుపై రష్యా చేపట్టిన రాకెట్ దాడుల్లో మృతిచెందిన వారి సంఖ్య 25కు చేరినట్టు అధికారులు తెలిపారు.