బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ పడుతున్న రిషి సునాక్ అక్కడి ప్రవాస భారతీయుల మనసులు గెలుచుకున్నారు. సతీమణి అక్షతా మూర్తితో కలిసి ఆయన గోమాతకు పూజలు నిర్వహించారు. రిషి సునక్ మొదట భారతీయ సంప్రదాయం ప్రకారం ఇత్తడి చెంబుతో ఆవుకు నీళ్లు తాగించారు. అనంతరం అర్చకుడి వేదమంత్రోచ్చరణల నడుమ గోవుకు హారతి ఇచ్చారు. గోమాత ఆశీర్వాదం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను బ్రిటన్లోని భారత సంతతి వ్యక్తులు సామాజిక మాద్యమాల్లో షేర్ చేశారు. రిషి సునాక్ దంపతులపై ప్రశంసల వర్షం కురిపించారు. భారత సంస్కృతి, సంప్రదాయాలకు ఎల్లలు లేనందుకు ఇదే నిదర్శనమన్నారు.