సమాజంలోని ప్రస్తుత పరిస్థితులతో వాస్తవానికి దగ్గరగా ఉండే కథలతో సినిమాలు తెరకెక్కిస్తుంటారు దర్శకుడు పి.సునీల్‌కుమార్ రెడ్డి. తాజాగా ఆయన దర్శకత్వంలో రూపొందిన సినిమా వెల్‌కమ్ టు తీహార్ కాలేజ్. మనోజ్ నందన్ హీరో. డా.ఎల్‌ఎన్ రావు, యక్కలి రవీంద్ర బాబు నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా సునీల్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇంటర్మీడిట్ విద్యా వ్యవస్థల్లో విద్య పేరుతో జరుగుతున్న అరాచకం నేపథ్యంలో సునిశిత హాస్యంతో రూపొందించిన చిత్రం ఇది. ర్యాంకుల పోటీలో పడి నలిగిపోతున్న యువత అంతరంగాన్ని వినోదభరితంగా, ఆలోచించప జేసేలా తెరకెక్కించాను అన్నారు. ఫణి చక్రవర్తి, కృష్ణ తేజ, సోనీ రెడ్డి, మనీషా, సత్యానంద్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాని సెప్టెబంరులో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. టీ.ఎన్.ఆర్, సత్యానంద్, బేబి చిన్నారి, మౌనిక, వెంకట్‌రామన్, ఎఫ్.ఎమ్.బాబాయ్, వెంకట్‌రామన్, ప్రసాద్, లెండి హరి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సాయి జేమ్స్, సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి.