ఎయిర్ ఇండియా తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగుల వేతనాలను కరోనా ముందు నాటి స్థాయికి పునరుద్ధరించింది. కరోనా కారణంగా వేతనాల్లో కోత విధించగా, వాటిని అలాగే కొనసాగిస్తూ వస్తున్నారు. నష్టాల్లో కూరుకుపోయిన విమాన సంస్థ ఎయిర్ ఇండియాను 2022 జనవరిలో టాటా సన్స్ సొంతం చేసుకుంది. దీంతో 2022 సెప్టెంబర్ 1 నుంచి సిబ్బంది లేఓవర్ అలవెన్స్, మీల్ అరేంజ్‌మెంట్స్‌ను పునరుద్ధరించాలని కంపెనీ నిర్ణయించింది. ఎయిర్ ఇండియా సిఇఓ, మేనేజింగ్ డైరెక్టర్ క్యాంబ్‌బెల్ విల్సన్ మాట్లాడుతూ 2022 సెప్టెంబర్ 1 నుంచి ఉద్యోగులు అందరికీ వేతన పునరుద్ధరణను విమాన సంస్థ చేస్తుందని అన్నారు.