విరాట్ కార్తీక్, యామిన్ రాజ్, ప్రియాంక రెవరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ప్రేమదేశపు యువరాణి. ఈ సినిమా మోషన్ పోస్టర్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రేమలో సరికొత్త యాంగిల్‌ని ఈ చిత్రంలో టచ్ చేసినట్లు అనిపిస్తోంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి అన్నారు. సాయి సునీల్ చెప్పిన కథ నచ్చడంతో నా సన్నిహితుడు హరిప్రసాద్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాను. మంచి ప్రేమకథా చిత్రమిది. త్వరలోనే సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం అన్నారు వేమూరి ఆనంద్. సాయి సునీల్ మాట్లాడుతూ ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు మా చిత్రంలో ఉంటాయి అన్నారు. ప్రేమదేశపు యువరాణి వంటి మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్ అన్నారు విరాట్ కార్తీక్, యూమిన్ రాజ్. ఈ చిత్రానికి సాయి సునీల్ నిమ్మల దర్శకత్వం. ఏజీఏ క్రియేషన్స్, ఎస్2హెచ్2 ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఆనంద్ వేమూరి, హరిప్రసాద్ సీహెచ్ నిర్మించారు. ఈ చిత్రానికి కెమెరా : శివకుమార్ దేవరకొండ సంగీతం: అజయ్ పట్నాయక్.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)