తెలంగాణలో అల్లకల్లోలం సృష్టించేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని టీఆర్‌ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కవిత మీద ఢల్లీి ఎంపీ చేసిన ఆరోపణలను ఎన్నారైలమంతా తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ప్రాంతీయ పార్టీలను కూలగొట్టి తమ పార్టీలను అధికారంలోకి తెచ్చుకోవాలని కాషాయపార్టీ కంకణం కట్టుకున్నదని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారం నచ్చకే ఎన్డీఏ నుంచి బీజేపీ మిత్ర బృందాలన్నీ బయటకు వచ్యాయని తెలిపారు. ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ ఎదిరించి మాట్లాడుతున్నందునే అసత్య ఆరోపణలు, దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. కావాలనే మునుగోడు ఎన్నిక తెచ్చారని ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తెలిపారు. మునుగోడులో ప్రజలు టీఆర్‌ఎస్ వెంటే ఉంటారని, గులాబీ అభ్యర్థికే పట్టంగడతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలం, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, టీఆర్‌ఎస్ ఎన్నారై నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)