బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమెరికాలో నివసించే బిగ్ బీ అభిమాని ఒకరు తాజాగా ఆయన విగ్రహాన్ని తన ఇంటి ముందు ప్రతిష్టించారు. న్యూజెర్సీలోని ఎడిసన్ నగరంలో నివసించే గొనీ సేఠ్, రింకూ దంపతులు అమితాబచ్చన్‌కు వీరాభిమానాలు. ఎంతగా అంటే వారు ఏకంగా తన ఇంటి ముందు బిగ్ బీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కౌన్ బనేగా కరోడ్‌పతిలో బచ్చన్ స్టైల్ ఆధారంగా ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఇందుకోసం ఏకంగా 60 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. రాజస్థాన్‌లో తయారు చేయించి అమెరికా తీసుకొచ్చారు. స్థానికంగా ఉన్న ప్రముఖ భారత సంతతి వ్యక్తితో విగ్రహావిష్కరణ కార్యక్రాన్ని కూడా జరిపించారు. ఈ విగ్రహావిష్కరణ సభలో చాలా మంది అమితాబ్ అభిమానులు పాల్గొన్నారు. 1990లో న్యూజెర్సీలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గోపీని అమితాబ్ కలిశారు. తమకు బిగ్ బీ అంటే దేవుడితో సమానమని గోపీ సేఠ్ దంపతులు ఈ సందర్భంగా చెప్పారు. స్క్రీన్ పైనే కాకుండా నిజజీవితంలో కూడా బిగ్ బీ ఆదర్శవంతుడని ప్రశంసించారు. ఈ విషయం ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశమవుతోంది.