ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. విదేశాల్లోనూ ఏఆర్ రెహమాన్‌కు ఎంతో గౌరవం ఉంది. కెనడాలోని అంటారియా ప్రాంతం మార్కమ్ నగరంలో ఓ వీధికి ఏఆర్ రెహమన్ పేరు పెట్టడం వివేషం. ఈ సందర్భంగా ఏఆర్ రెహమాన్ స్పందించారు. ఇది తనకు లభించిన అరుదైన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. నేను ఎన్నడూ ఊహంచలేదు. మార్కమ్ మేయర్‌కు, ఆ నగర కౌన్సిలర్లకు, భారత కాన్సులేట్ జనరల్‌కు, కెనడా ప్రజలకు కృతజ్ఞతాభివందనాలు తెలిపారు. తన సంగీత స్వరాలను ఆదరించి, ప్రోత్సహిస్తున్న భారతీయ సోదర, సోదరీమణులకూ కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు. ఏ.ఆర్. రెహమన్ ప్రస్తుతం కెనడా పర్యనటలో ఉన్నారు.
