భారత వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ సంపాదనలో దూసుకెళ్తున్నారు. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో మూడో ప్లేస్ లో నిలిచారు వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ. ఆసియా నుంచి ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా నిలిచారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, చైనాకు చెందిన జాక్ మాకు సాధ్యం కాని ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్న్ ప్రకారం 137.4 బిలియన్ డాలర్ల సంపదతో అదానీ.. ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్డ్‌ను అధిగమించి ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానానికి దూసుకెళ్లారు. అమెరికా చెందిన ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ తొలి రెండు ర్యాంకుల్లో ఉన్నారు.
తన వ్యాపార విస్తరణతో అదానీ ఈ ఏడాదిలోనే ఏకంగా 60.9 బిలియన్లను ఆర్జించారు. ఈ క్రమంలో ఫిబ్రవరిలో ఆసియాలో అత్యంత ధనవంతుడిగా అంబానీని అధిగమించారు. ఏప్రిల్ సెంటి బిలియనీర్ అయ్యారు. గత నెలలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌ను అధిగమంచి ప్రపంచంలోనే నాలుగో సంపన్న వ్యక్తిగా నిలిచారు. తాజాగా మూడో ర్యాంకుకు చేరుకున్నారు.