అమెరికాకు ఓ చిన్న దేశం గట్టి షాక్ ఇచ్చింది. తమ తీరప్రాంత జలాల్లోకి అమెరికాకు చెందిన మిలిటరీ నౌక వచ్చేందుకు నో చెప్పింది. పసిఫిక్ దేశమైన సోలమన్ ఐలాండ్స్ ప్రధాని అధికార ప్రతినిధి ఈ మేరకు వెల్లడిరచారు. విదేశాలకు చెందిన మిలిటరీ నౌకలు సోలమన్ ఐలాడ్స్ నౌకాయ్రాల్లోకి రావటంపై తాత్కాలిక నిషేధం విధించినట్లు తెలిపారు. ఈ తాత్కాలిక నిషేధం ప్రపంచంలోని అన్ని దేశాలకు వర్తిస్తుందని స్పష్టం చేశారు. దేశంలోని నౌకాశ్రయంలో ఇంధనం నింపుకోవాలని అమెరికా కోస్ట్ గార్డ్ షిప్‌కు అనుమతించలేదన్న నేపథ్యంలో నిషేధం అంశాన్ని వెల్లడిరచారు సోలమన్ ప్రధాని మనస్సే సోగవరే. ఈ నిర్ణయం ప్రంచంలోని అన్ని దేశాలకు వర్తిస్తుంది. ఏ ఒక్క దేశానికి ప్రత్యేక అనుమతి లేదు. నౌకల అనుమతి ప్రక్రియను పున పరిశీలించే అంశంపై నిర్దిష్ట సమయం ఏమీ లేదు అని ప్రధాని ప్రతినిథి తెలిపారు.
