రోహింగ్యా శరణార్థులు తమ దేశానికి అతిపెద్ద సమస్యగా మారారని బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వారిని తిరిగి స్వదేశానికి పంపించేందుకు అంతర్జాతీయ సమాజాలతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. లక్షలాది మంది శరణార్థులు దేశంలో ఉండటం వల్ల పలు సవాళ్లు ఎదురువుతున్నాయన్నారు. ఈ సమస్యను పరిష్కరించటంలో భారత్ కీలక పాత్ర పోషించగలదని నమ్ముతున్నట్లు తెలిపారు. రోహింగ్యాల సమస్య అతిపెద్ద భారమని మాకు తెలుసు. కొంత మంది శరణార్థులకు ఆశ్రయం ఇవ్వొచ్చు. కానీ, పెద్దగా ఏమీ చేయలేదు. మా దేశంలో 1.1 మిలియన్ల మంది రోహింగ్యాలు ఉన్నారు. అందుకే వారు తిరిగి సొంత ఇళ్లకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజం, పోరుగు దేశాలతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు.