యూకే తదుపరి ప్రధాని ఎవరో మరికొద్ది గంటల్లోనే తేలిపోనుంది. భారత సంతతి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ (42), మంత్రి లిజ్ ట్రస్(47) ఎన్నికల బరిలో నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ పోటీలో లిజ్ ట్రస్ ముందంజలో ఉన్నట్లు పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. వీరిద్దరిలో విజేతను తేల్చడానికి జరిగిన ఎన్నికలు ముగిశాయి. ఫలితాలను నేడు ప్రకటించనున్నారు. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన లక్షా 60 వేల మంది క్రియాశీల సభ్యులు, ఆగస్టు నెల నుంచి పోస్ట్ ద్వారా, ఆన్‌లైన్‌లోనూ ఈ నెల 2వ తేదీ వరకు ఓటుహక్కు వినియోగించుకున్నారు. కాగా మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేయడంలో ఎన్నిక అనివార్యమైంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)