ప్రపంచంలోనే అత్యుత్తమ పురస్కారాల్లో ఒకటైన ఎమ్మీ అవార్డును అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా గెలుచుకున్నారు. నెట్‌ప్లిక్స్ డాక్యుమెంటరీ సిరీస్ అవర్ గ్రేట్ నేషనల్ పార్క్స్ గాత్రం అందించినందుకుగానూ ఆయనకు బెస్ట్ నేరేటర్ పురస్కారం దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జాతీయ పార్కుల గురించి ఈ ఐదు భాగాల సిరీస్‌లో వివరించారు. దీన్ని ఒబామా, ఆయన సతీమణి మిషెల్ ఒబామాల నిర్మాణ సంస్థ హయార్ గ్రాండ్ నిర్మించడం గమనార్హం. అమెరికా అధ్యక్షులుగా పనిచేసినవారిలో ఎమ్మీ అవార్డు గెలుచుకున్న రెండో వ్యక్తి ఒబామానే. ఒబామా ఇప్పటికే రెండు గ్రామీ అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. తను రాసిన ఏ ప్రామిస్డ్ ల్యాండ్, ది అడాసిటీ ఆప్ హోప్ పుస్తకాల ఆడియో వెర్షన్‌లకు గాత్రం అందించినందుకుగానూ ఆయన ఈ అవార్డులు అందుకున్నారు. మిషెల్ ఒబామా కూడా నేరేటర్‌గా గతంలో గ్రామీ గెలుచుకున్నారు. గతంలో డివైట్ డి ఐసెన్‌హోవర్ 1956లో అందుకున్నారు. తాజాగా ఒబామా ఎమ్మీ అవార్డు అందుకోవడంతో ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)