తెలుగు అసోసియేషన్ అఫ్ లండన్ కల్చరల్ సెంటర్ (TCC), లండన్ పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న వారికి తెలుగు భాషా సంస్కృతి, సాహిత్యం, సంగీతం యెడల ఆసక్తి వున్న వారందరికి, ఆయా రంగాలలో ప్రఖ్యాతి గాంచిన గురువుల ద్వారా ఆన్ లైన్ లలో శని ,ఆదివారాల లో తెలుగు భాష, కర్ణాటక సంగీతం మరియు భరతనాట్యం శిక్షణా తరగతులు నిర్వహిస్తుంది. సంగీతం మరియు నృత్యములో శిక్షణ పొందిన విద్యార్థులకు గుర్తింపు చెందిన విశ్వవిద్యాలయాల నుండి సర్టిఫికేషన్ అందజేయడం జరుగుతుంది. ఈ విద్యార్థులు అన్ని TAL ఉత్సవాల్లో ముఖ్యంగా బాలల దినోత్సవం, ఉగాది మరియు సంక్రాంతి వేడుకలలో వారి ప్రతిభను ప్రదర్శించడం జరుగుతుంది.ఈ అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీరు , మీ పిల్లలు TCC లో జాయిన్ అవ్వండి.శరత్కాలం (Autumn term) తరగతులు సెప్టెంబర్ నుండి డిసెంబర్ (Sept – Dec) వరకు, సెప్టెంబర్ 10th నుండి మొదలు అవుతున్నాయి.