తెలుగు యువకుడికి అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలో 230 సంవత్సరాల చరిత్ర కలిగిన జార్జిటౌన్ యూనివర్సిటీ (వాషింగ్టన్ డీసీ)లోని ఫారిస్ సర్వీస్ స్కూలు శతాబ్ధి పురస్కారానికి హైదరాబాద్ యువకుడు రాజా కార్తికేయ గుండును ఎంపిక చేసింది. తమ వద్ద చదువుకున్న విద్యార్థుల నుంచి ఐదుగురిని ఈ పురస్కారానికి ఎంపిక చేయగా, వాళ్లలో రాజా కార్తికేయ ఒకరు. ప్రస్తుతం ఆయన ఐక్యరాజ్యసమితిలో దౌత్య వేత్తగా పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లోని భారతీయ విద్యాభవన్, నిజాం కళాశాల పూర్వ విద్యార్థి అయిన రాజా కార్తికేయ ఐఐఎఫ్‌టీ (న్యూఢల్లీి) నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ఆ తర్వాత 2007`09లో జార్జిటౌన్ యూనివర్సిటీలోని వాల్ష్ స్కూల్ ఆఫ్ ఫారిస్ సర్వీస్ నుంచి ఎంఎస్‌ఎఫ్‌ఎస్ (మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫారిన్ సర్వీస్) చేశారు.
గత వందేళ్ల విద్యార్థుల నుంచి వంద మందికి పైగా పేర్లు ఈ అవార్డు పరిశీలనకు వచ్చాయి. వారిలో ఎంఎస్‌ఎఫ్‌ఎస్ కోర్సు పూర్తిచేసి నాయకత్వం, సృజనాత్మకత, విలువలు, సమాజ సేవ, మావన సంబంధాలను ప్రామాణికంగా అభ్యర్థులను సెలెక్ట్ చేసినట్లు ఎంపిక కమిటీ తెలిపింది. ఎంపిక కమిటీలో పూర్వవిద్యార్థుల సంఘం ప్రతినిధులు, యూనివర్సిటీ అధ్యాపక ప్రతినిధులు ఉన్నారు. వారు అన్ని నామినేషన్లను క్షుణ్ణంగా పరిశీలించి ఐదుగురిని ఎంపిక చేసినట్లు ఎంఎస్‌ఎఫ్‌ఎస్`100 ఇయర్స్ కమిటీ ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్‌లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ఐదుగురికి శతాబ్ధి పురస్కారాన్ని ఎంపిక చేస్తామని తెలిపింది. కాగా జనవరి 2001 గుజరాత్ భూకంపం, డిసెంబర్ 2004 సునామీ సమయంలో స్వచ్ఛందంగా సేవలందింంచడం, కరోనా సమయంలో అవగాహన కల్పించడం వంటి సేవలకు గాను ఈ పురస్కారం పొందానని కార్తికేయ తెలిపారు.