శర్వానంద్ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. రాశీఖన్నా కథానాయిక. ప్రియమణి కీలక పాత్ర పోషిస్తోంది. కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి త్రివిక్రమ్ క్లాప్ కొట్టారు. చందూ మొండేటి, హను రాఘవపూడి, సుధీర్ వర్మ, వంశీ, విక్రమ్ సంయుక్తంగా దర్శకుడిగా స్క్రిప్టు అందించారు. విభిన్నమైన పొలిటికల్ యాక్షన్ డ్రామా చిత్రమిది. అక్టోబర్ నుంచి రెగ్యులర్ చిత్రీకరణ మొదలవుతుంది. మరిన్న వివరాలు త్వరలో వెల్లడిస్తాం అని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాకి సంగీతం: యువన్ శంకర్ రాజా, ఛాయాగ్రహణం: జిమ్షి ఖలీద్, ఆర్ట్: విఠల్, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: కృష్ణ చైతన్య.