ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో మరో 25 మంది అమెరికన్లపై వ్యక్తిగత ఆంక్షల్ని విధిస్తున్నట్లు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ ప్రకటించారు. వీరిలో నటులు సియాన్ పెన్, బెన్ స్టిల్లర్ వంటివారు ఉన్నారు. తమ దేశానికి చెందినవారిపై అమెరికా విధించిన ఆంక్షలకు బదులుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రష్యా తెలిపింది. అమెరికా వాణిజ్య మంత్రి గినా రాయ్‌మండోతో పాటు ఆరిజోనా, ఉత్తర డకోటా, దక్షిణ డకోటా, ఫ్లోరిడా, పెన్సిల్వేనియా సెనేటర్ల పై ఆంక్షలు మొదలయ్యాయి. వ్యాపార, విద్యారంగ ప్రముఖులు, కొందరు ప్రభుత్వాధికారులు రష్యాలో అడుగుపెట్టడానికి వీల్లేకుండా శాశ్వత నిషేధాన్ని విధించినట్లు విదేశాంగా మంత్రిత్వశాఖ తెలిపింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన కుటుంబ సభ్యులు సహా పలువురిపై రష్యా ఇదివరకే నిషేధం విధించిన విషయం తెలిసిందే.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)