బ్రిటన్ హోంమంత్రి ప్రీతి పటేల్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ప్రధాని బోరిస్ జాన్సన్‌కు తన లేఖను అందజేశారు. మంత్రిగా తాను తీసుకున్న నిర్ణయాలను, చేపట్టిన కార్యక్రమాలను అందులో ప్రస్తావించారు. కన్జర్వేటివ్ పార్టీ నేతగా, నూతన ప్రధానిగా లిజ్ ట్రస్ ఎన్నికైన క్రమంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ట్రస్‌కు శుభాకాంక్షలు తెలిపిన ప్రీతి నూతన ప్రధానికి తన మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ప్రధాని బోరిస్ జాన్సస్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు మంత్రులు రాజీనామా చేశారు. ఇందులో భారత సంతతికి చెందని ప్రీతి పటేల్ సైతం ఉన్నారు.