అమెరికాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌లో డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.15,000 కోట్లు వెచ్చించే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో సంస్థ జరుపుతున్న చర్చలు పురోగతిలో ఉన్నాయి. భాగ్యనగరికి 30`40 కిలోమీటర్ల పరిధిలో ఈ డేటా కేంద్రం రానుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడిరచాయి. కొత్త ఫెసిలిటీ విషయమై ఒకటి రెండు నెలల్లో మైక్రోసాఫ్ట్ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడవచ్చని ఆయన అన్నారు. ప్రతిపాదిత కేంద్రానికి ఎన్ని రకాలు అవసరం అవుతాయి, ఎంత మంది ఉద్యోగులను నియమించుకుంటారనే విషయాలు పూర్తి ప్రాజెక్ట్ రిపోర్ట్ వస్తేగానీ చెప్పలేమని ఆయన వ్యాఖ్యానించారు.
అయితే మైక్రోసాఫ్ట్ ఆఫీస్, విండోస్, విజువల్ స్టూడియో, డెవలపర్ టూల్స్ ఫర్ విండోస్, బింగ్ అభివృద్ధిలో హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్ ఇంజనీర్ల పాత్ర కీలకం. అమెరికా వెలుపల అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రం కూడా ఇదే. ఇక్కడి ఉద్యోగుల్లో ప్రతిభ, వనరులు, పట్టుదల సమృద్ధిగా ఉన్నాయని సత్య నాదెళ్ల కితాబిచ్చారు కూడా.