నివాస్ విష్ణు, సారా ఆచార్ జంటగా శివ శ్రీ మిగడ తెరకెక్కించిన చిత్రం రహస్య. ఎస్.గౌతమి నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో నివాస్ విష్ణు మాట్లాడుతూ డిఫరెంట్ కోణాలను టచ్ చేస్తూ సస్పెన్స్ మిస్టరీగా రహస్య చిత్రాన్ని బాగా తీశాడు శివ. ప్రేక్షకులు థ్రిల్ అవుతారు అని అన్నారు. నాకు నటనంటే ఆసక్తి ఉన్నా ఇండస్ట్రీకి వచ్చేందుకు సరైన దారి దొరకలేదు. నా ఫ్రెండ్ సహాయంతో కెనడాలో సెటిలయ్యాను. కరోనా టైమ్‌లో రహస్య కథ నా వద్దకు వచ్చింది. ఇందులో ఎన్‌ఐఏ అధికారి విశ్వతేజ పాత్ర చేశారు. ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్స్ మధ్య ఎలాంటి అహం ఉంటుంది? ఒక కేసును చేధించే క్రమంలో వారి మధ్య ఎలాంటి క్లోజ్‌నెస్ పెరుగుతుంది? అనే కథాంశంతో ఈ చిత్రం ఉంటుంది అన్నారు. సెల్వ కుమార్ ప్రతి ఫ్రేమ్‌ని అందమైన పెయింటింగ్‌లా చక్కగా తెరకెక్కించారు. థ్రిల్ పంచే మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమా ఇది. తప్పకుండా అందరికీ నచ్చుతుందని నమ్మకంగా ఉంది అన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)