సాయి ధన్సిక ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా దక్షిణ. ఈ చిత్రాన్ని సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ఓషో తులసీరామ్ రూపొందిస్తున్నారు. అశోక్ షిండే నిర్మాత. రిషబ్ బస్సు, సుబష్, ఆనంద భారతి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పూజా కార్యక్రమాలతో సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన వంశీ కృష్ణ తొలి సన్నివేశానికి కెమెరా స్విచ్చాన్ చేయగా, ప్రణతి, శ్వేత భావన క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా అశోక్ షిండే మాట్లాడుతూ నాయిక ప్రధానంగా సాగే చిత్రమిది. నేటి నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తున్నాం. ఈ నెల 24 వరకు హైదరాబాద్‌లో ఫస్ట్ షెడ్యూల్, అక్టోబర్ 6 నుంచి 20 వరకు గోవాలో రెండో షెడ్యూల్‌ని ప్లాన్ చేశాం. మూడో షెడ్యూల్ నవంబరు 1 నుంచి 10 వరకు హైదరాబాద్‌లో జరుగుతుంది. నవంబర్ రెండో వారానికి షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేశాం అని అన్నారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: బాలాజీ, ఛాయాగ్రహణం: నర్సింగ్.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)