బ్రిటన్ రాణి ఎలిజబెత్-2(96) కన్నుమూశారు. గత అక్టోబర్ నుంచి అనారోగ్య కారణాలతో ఆమె దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం స్కాట్లాండ్‌లోని బాల్మరల్ కోటలో కన్నుమూశారు. ఆమె వయస్సు 96 సంవత్సరాలు. బ్రిటన్ చరిత్రలో 25 ఏండ్ల వయస్సు నుంచి రాణిగా కొనసాగుతూ వచ్చారు ఎలిజబెత్-2. తొలుత ఎలిజబెత్-2 కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు వైద్యులు. అటుపై బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్‌కు సమాచారం ఇచ్చారు. దీనిపై బ్రిటన్ విదేశాంగ శాఖ కామన్‌వెల్త్ దేశాలకు తెలిపింది. బ్రిటన్ రాణి ఎలిజబెత్ మరణించిన సంగతిని ప్రధాని లిజ్ ట్రస్ ధృవీకరించారు. ఆమె మృతి సందర్భంగా బ్రిటన్ ప్రభుత్వం 10 రోజుల సంతాప దినాలు ప్రకటించింది. సుదీర్ఘకాలంపాటు బ్రిటన్‌ను పరిపాలించిన పాలకురాలిగా ఆమె రికార్డు సృష్టించారు. రాణి మరణంతో యావత్ బ్రిటన్ శోకసంద్రంలో మునిగిపోయింది.