అమెరికా కుయుక్తులను ఎదుర్కోవాలంటే తమ దేశం అణ్వాయుధాలు ఉండాల్సిందేనని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ స్పష్టం చేశారు. ఉత్తర కొరియా కొత్త చట్టాన్ని రూపొందించింది. తనను తాను రక్షించుకునే నేపథ్యంలో ముందస్తుగా అణ్వాయుధ దాడి చేసే రీతిలో ఆ చట్టాన్ని తయారు చేశారు. అణ్వాయుధీకరణ అంశంలో వెనక్కి తగ్గేది లేదని కిమ్ జాంగ్ ఉన్ తేల్చి చెప్పారు. న్యూక్లియర్ వెపన్స్‌ను తగ్గించాలన్న విషయాన్ని ఏ రకంగానూ ఎంకరేజ్ చేయమని కిమ్ తెలిపారు. 2017 తర్వాత మళ్లీ ఉత్తర కొరియా అణు పరీక్షలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కొత్త తరహా చట్టాన్ని కిమ్ రూపొందించినట్లు భావిస్తున్నారు. దేశానికి న్యూక్లియర్ స్టేటస్ ఇస్తూ నార్త్ కొరియా పార్లమెంంట్ కొత్త చట్టాన్ని రూపొందించింది. అటామిక్ ఆయుధాలను ఆటోమెటిక్‌గా వాడుకునే అవకాశాన్ని మిలిటరీకి కల్పిస్తున్నట్లు కొత్త చట్టంలో పేర్కొన్నారు. ట్రంప్‌తో జరిగిన భేటీ తర్వాత కిమ్‌ను ఓదార్చేందుకు సాగిన ప్రయత్నాలు సఫలం కాలలేదు.