ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తున్న రష్యాకు మరో షాక్ ఎదురైంది. ఉక్రెయిన్ కీలక నగరాన్ని కోల్పోయింది. ఉక్రెయిన్ దళాలు ముందుకు చొచ్చుకొస్తున్నాయి. ఖార్కివ్ ప్రావిన్స్‌లోని ఇజియం నగరాన్ని తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. దీంతో రష్యా సైనికులు తమ ఆయుధాలు, ట్యాంకులు, మందుగుండును వదిలి ఆ నగరం నుంచి పారిపోయారు. మార్చిలో ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి రష్యా సైన్యం వెనుదిరిగిన తర్వాత ఆ దేశానికి మరో పెద్ద దెబ్బ. రష్యా దళాలు ఇజియం నగరాన్ని ఇప్పటి వరకు లాజిస్టిక్స్ బేస్‌గా ఉపయోగించాయి. డోనెట్‌స్కీ, లుహాన్‌స్కీతో పాటు పక్కనే డాన్‌బాస్‌కు ఉత్తరంగా ఉన్న ఈ ప్రాంతంలో కొన్ని నెలలుగా రష్యా సైనం మకాం వేసింది. అయితే ఉక్రెయిన్ దళాలు పురోగమించడంతో ఈ నగరాన్ని రష్యా కోల్పోయింది.
