Namaste NRI

అమెరికా నిర్ణయం పై.. భారత్‌ తీవ్ర నిరసన

పాకిస్థాన్‌కు సైనిక సాయం అందించాలనే అమెరికా నిర్ణయంపై భారత్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధుల్లో ఒకరైన డొనాల్డ్‌ ల్యూ కు తమ అభ్యంతరాలను తెలియజేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో పాక్‌కు సాయం చేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది.  ల్యూ సహా మరికొంత మంది ఉన్నతాధికారులతో భారత్‌, అమెరికా ఈ నెల 7, 8 తేదీల్లో 2G2  ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఆ మరుసటి రోజే పాక్‌కు అగ్రరాజ్యం సాయమందించాలని నిర్ణయించడం గమనార్హం.

                        పాక్‌కు ఎఫ్‌`16 యుద్ధ విమానాలకు మరమ్మతు, విడిభాగాల సరఫరా, సాఫ్ట్‌వేర్‌, ఇంజిన్‌ హార్డ్‌వేర్‌ ఆధునికీకరణ, ఎలక్ట్రానిక్‌ పోరాట సామర్థ్యం తదితరాలను సమకూర్చాలని అమెరికా నిర్ణయించింది. ఈ  ఒప్పందం విలువ 45 కోట్ల డాలర్లు. ఉగ్రవాదంపై పోరులో పాకిస్థాన్‌కు తోడ్పాటునివ్వడం ఈ నిర్ణయం వెనుక ముఖ్య ఉద్దేశం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events