క్వీన్ ఎలిజబెత్ 2 రాసిన రహస్య లేఖ ఒకటి ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఖజానా లాకర్లో ఉంది. అయితే ఈ లేఖను తెరిచి అందులె ఆమె ఏం రాశారో అన్నది చదివి తెలుసుకునేందుకు మరో 63 ఏళ్లు ఆగాల్సిందే. కామన్వెల్త్ దేశాలైన ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌కు క్వీన్ ఎలిజబెత్ 2 అధినేత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తన జీవిత కాలంలో ఆస్ట్రేలియాను ఆమె 16 సార్లు సందర్శించారు. 1986 నవంబర్‌లో ఆస్ట్రేలియాలో పర్యటించిన సందర్భంగా క్వీన్ ఎలిజబెత్ 2, సిడ్నీ నగర ప్రజలనుద్దేశించి ఒక రహస్య లేఖ రాశారు. వందేళ్ల తర్వాత అంటే 2085లో సిడ్నీ నగర మేయర్‌కు అనువైన రోజున ఈ లేఖను తెరిచి అందులోని సందేశాన్ని ప్రజలకు తెలియజేయాలని లేఖ కవర్‌పై పేర్కొన్నారు. దానిపై అమె సంతకం కూడా చేశారు. అయితే క్వీన్ ఎలిజబెత్ ఈ లేఖలో ఏం రాశారో అన్నది ఆమె వ్యక్తిగత సిబ్బందికి కూడా తెలియదు. 1986 నుంచి ఈ రహస్య లేఖను ఒక గాజు పెట్టేలో ఉంచి సిడ్నీలోని చారిత్రక భవనంలోకి ఖజానా లాకర్లో భద్రపరిచారు.
