రాజ్ బాల హీరోగా మెగా ఫిలిమ్స్ బ్యానర్ ఓ సినిమా నిర్మిస్తోంది. కమలాకరావు, కిషోర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈషా చావ్లా హీరోయిన్. రాజ్ బాల పుట్టినరోజు సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం నేను మెగా ఫిలిమ్స్ పతాకంపై కమలాకరరావు, కిషోర్ నిర్మాతలుగా జాక్ దర్శకత్వంలో హీరోగా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు మంచి ప్రాజెక్టు అవుతుంది. ఈ సినిమా 40 శాతం షూటింగ్ జరిగింది. ఇందులో కాలకేయ ప్రభాకర్ విలన్‌గా, ఈషా చావ్లా హీరోయిన్‌గా నటిస్తున్నారు. నేను మాస్ క్యారెక్టర్‌లో ఆద్యంతం ఎంటర్‌టైనర్‌లా సాగే ఈ సినిమా ఇప్పుడొస్తున్న సినిమాల్లా కాకుండా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. గత సినిమాలకు పూర్తి భిన్నమైన చిత్రమిది. కొత్త షెడ్యూల్ త్వరలో మొదలవుతుంది. ఈ సినిమాతో నటుడిగా నాకు మంచి పేరొస్తుందని నమ్ముతున్నా అని అన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)