అభిరామ్ వర్మ, సాత్వికా రాజ్ జంటగా బాలుశర్మ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం నీతో. పృధ్వీ క్రియేషన్స్, మిలియమ్ డ్రీమ్స్ క్రియేషన్స్ బ్యానర్లపై ఏవీఆర్ స్వామి, కీర్తన, స్నేహాల్ నిర్మాతలు. ఈ చిత్ర ట్రైలర్‌ను దర్శకుడు హను రాఘవపూడి రిలీజ్ చేసి, చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనకు రిలేషన్‌షిప్ ఎలా ఎండ్ అయిందో గుర్తుంటుంది కానీ, ఎలా స్టార్ట్ అవుతుందో గుర్తుకు రాదు వంటి సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రేమికుల సంఘర్షణకు అద్దం పట్టే చిత్రమిదని అన్నారు. ట్రైలర్‌కి మంచి స్పందన వస్తోంది అని నిర్మాతలు పేర్కొన్నారు. రవివర్మ, నేహా కృష్ణ, కావ్య రామన్, అపూర్వ శ్రీనివాసన్, మోహిత్ బైద్ తదితరులు నటిస్తున్నారు. ఈ నెల 30 ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సుందర్ రామ్ కృష్ణన్, సంగీతం: వివేక్ సాగర్, దర్శకత్వం : బాలు శర్మ.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)