ధనుష్, సంయుక్తా మీనన్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు, తమిళంలో తెరకెక్కిన చిత్రం సార్ (తెలుగు). తమిళంలో వాత్తి. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సాయి సౌజన్యతో కలిసి సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో ధనుస్ క్లాస్ రూంలో టేబుల్‌పై కూర్చొని విద్యార్థులకు గణితం బోధిస్తూ కనిపించారు. డిసెంబరు 2 నుంచి ఈ సార్ తరగతులు వినడానికి అందరూ సిద్ధంగా ఉండండి అంటూ ఆ ఫొటోకు ఓ వ్యాఖ్యను కూడా జోడిరచారు. ప్రస్తుత విద్యా వ్యవస్థ తీరు నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో సాయికుమార్, తనికెళ్ల భరణి, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో డిసెంబర్ 2న విడుదల చేస్తాం అని నాగవంశీ, ఎస్. సాయి సౌజన్య తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: జె.యువరాజ్, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)