యువ హీరో సంతోశ్ శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న చిత్రం లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్. వెంకట్ బోయనపల్లి నిర్మాత. ఆముక్త క్రియేషన్, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. మేర్లపాటి గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని ప్రముఖ కథానాయకుడు నితిన్ విడుదల చేశారు. హీరో సంతోశ్ స్నేహితులతో కలిసి ఓ టూరిస్టు ప్లేస్‌కు వెళతారు. అక్కడ హీరోయిన్ కలుస్తుంది. తనకు తెలిసిన ప్రతి విషయూన్ని తన ఛానల్‌లో పెడతుంటాడు. ఆ క్రమంలో అనుకోని ప్రమాదంలో ఇరుక్కోంటాడు. దాన్నుంటి ఎలా బయటపడతాడు అనేది కథ. నెల్లూరు సుదర్శన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్‌లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, ఛాయాగ్రహణం: వసంత్.