భారత సంతతికి చెందిన ఇంజినీర్, ఔత్సాహిక పారిశ్రామికవేత్త శ్రినా కురణి అమెరికా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. కాలిఫోర్నియా జిల్లా నుంచి అమె హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కు పోటీ చేయనున్నది. రివర్‌సైడ్‌లో ఉన్న భారతీయ ఇమ్మిగ్రాంట్ పేరెంట్స్‌కు కురణి జన్మించింది. 2022 నవంబర్‌లో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ నేత కెన్ కాల్వర్ట్‌పై ఆమె పోటీ చేయనున్నారు. సీఏ`32 స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. కెన్ కాల్వర్ట్ 30 ఏళ్ల నుంచి పదవిలో ఉన్నారనీ, కానీ ఈ ప్రాంతానికి ఆయన ఏమీ చేయలేదని, ఈసారి కొత్త పంథాలో వెళ్లాలని ఆమె అన్నారు. లా సిరా హైస్కూల్ నుంచి ఆమె గ్రాడ్యుయేట్ అయ్యారు. యూసీ రివర్‌సైడ్‌లో ఆమె మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసింది. ఆహార వ్యర్ధాల నియంత్రణ గురించి స్టార్టప్ కంపెనీల్లో ఆమె చేశారు.