హిందూ మహాసముద్రంలో చైనా నౌకాదళ కార్యకలాపాలు పెరుగుతుండటంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. దాని దూకుడుకు అడ్డకట్టు వేసేందుకు వీలుగా భారత్‌తో రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటున్నట్లు తెలిపింది. అమెరికా రక్షణ శాఖ సహాయ కార్యదర్శి (ఆసియా పసిఫిక్ ప్రాంతం) ఎలీ రాట్నర్ మీడియాతో మాట్లాడారు. ద్వైపాక్షిక రక్షణ సంబంధాల బలోపేతంలో భాగంగా` విమానాల నుంచి ప్రయోగించే డ్రోన్లను భారత్, అమెరికా సంయుక్తంగా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడిరచారు. దక్షిణాసియా, ఆగ్నేయాసియాలోని పలు దేశాలకు భారత్ వాటిని ఎగుమతి చేసేందుకు వీలు కల్పిస్తామని పేర్కొన్నారు.
దక్షిణసియా, ఆగ్నేయాసియాలోని పలు దేశాలకు భారత్ వాటిని ఎగుమతి చేసేందుకు వీలు కల్పిస్తామని పేర్కొన్నారు. మరి కొన్ని భారీ ఆయుధాలను కూడా ఇరు దేశాలు సంయుక్తంగా తయారు చేసే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. మానవ రహిత విమానాల రూపకల్పనకు సంబంధించిన ఓ ఒప్పందంపై భారత్` అమెరికా గత ఏడాది సంతకాలు చేసిన సంగతి గమనార్హం.