శకుంతల, దుష్యంత మహారాజు ప్రణయ గాథతో గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం శాకుంతలం. అభిజ్ఞాన శాకుంతలం నాటకం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. శకుంతలగా సమంత, దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటిస్తున్నారు. మోహన్‌బాబు, ప్రకాష్ రాజ్, మధుబాల, గౌతమి, ఆదితీబాలన్, అనన్యా నాగళ్ల, జిస్సు సేన్ గుప్తా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియషన్స్, గుణ టీమ్ వర్క్స్ పై నీలిమ గుణ నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రాన్ని నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళంలో విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించారు. కశ్మీర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్, ఉన్నత సాంకేతిక విలువలతో తెరకెక్కించామని మూవీ టీమ్ తెలిపింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)