Namaste NRI

చైనాలో సైనిక తిరుగుబాటు…అధ్యక్షుడిగా జిన్‌పింగ్ ను

కమ్యూనిస్టు పార్టీ పాలనలో ఉన్న చైనాలో ప్రభుత్వంపై సైనిక తిరుగుబాటు చేస్తున్నట్లు తెలుస్తున్నది. శాశ్వత అధ్యక్షుడిగా నియమితులైన జీ జిన్‌పింగ్‌ను సైన్యం గృహ నిర్బంధంలో పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరలైంది. ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక సంపత్తి గల చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) ఇప్పుడు దేశ రాజధాని బీజింగ్‌ వైపు కదులుతున్నట్లు వార్తలొస్తున్నాయి. దాదాపు 50 వేల మంది సైనిక జవాన్లు బీజింగ్‌ దిశగా కదులుతున్నాయి. హెబెయిలోని రaాంజియాకౌ నగరాన్ని దాటి బీజింగ్‌కు శివారుల్లోకి సైన్యం చేరుకుందని సమాచారం.  దేశ రాజధాని మార్గంలో 80 కిలో మీటర్ల పొడవునా సైనిక వాహనాలే కనిపిస్తున్నాయని పలువురు చైనీయులు ట్విట్టర్‌ వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారు. పీఎల్‌ఏ మొత్తం అధికార యంత్రాంగాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నదని, చైనా అధ్యక్షుడిగా లీ కియామింగ్‌ను నియమించిందని వార్తలొస్తున్నాయి.  అయితే చైనా కమ్యూనిస్టు పార్టీ గానీ, ఆ దేశ అధికారిక మీడియా గానీ ఈ విషయంపై ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతోఇది నిజమేనా? లేక రూమారా? అనే విసయం అయోమయం నెలకొంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events