ఐరాస భద్రతామండలిలో భారత్, బ్రెజిల్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న ప్రతిపాదనకు రష్యా మద్దతు ప్రకటించింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లవ్రోవ్ మాట్లాడుతూ ఈ రెండు దేశాలు అంతర్జాతీయంగా కీలకమైనవని పేర్కొన్నారు. సమకాలీన వాస్తవాలకు అనుగుణంగా మండలిలో మార్పులు జరగాలని అన్నారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లవ్రోవ్‌తో జైశంకర్ జరిపిన అనేక అంశాలు చర్చకు వచ్చాయి. ద్వైపాక్షిక సహకారం, ఉక్రెయిన్ యుద్ధం, ఐరాస సంస్కరణలు వంటివి దీనిలో ఉన్నాయి. వివిధ రంగాల్లో ప్రధాన భాగస్వామిగా రష్యా నిలుస్తుందని జై శంకర్ అన్నారు. 100 మందికి పైగా విదేశాంగ మంత్రులను, వారి ప్రతినిధులను కలిశారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)