Namaste NRI

అక్టోబర్ 22న ఆస్ట్రేలియాలో పీవీ విగ్రహావిష్కరణ : మహేష్ బిగాల

భారత మాజీ ప్రధాని దివంగత  పీవీ నరసింహారావు విగ్రహాన్ని అక్టోబర్‌ 22న ఆస్ట్రేలియాలో ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రావాల్సిందిగా పీవీ శత జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్‌  కేశవరావును టీఆర్‌ఎస్‌ ఎన్నారై కో ఆర్డినేటర్‌ మహేష్‌ బిగాల ఆహ్వానించారు. అలాగే పీవీ కుటుంబ సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులను ఆహ్వానించినట్లు  మహేశ్‌ బిగాల తెలిపారు. అక్కడ ప్రభుత్వ ప్రతినిధుల సహకారంతో సిడ్నీలోని ఓంబుష్‌ పార్క్‌లో అక్టోబర్‌ 22న ఉదయం 11 గంటలకు విగ్రహ ప్రతిష్ఠాపన జరుగుతుందన్నారు. అనంతరం పీవీ శత జయంత్యుత్సవాల కమిటీ సభ్యులు ఆంధ్రప్రదేశ్‌,  తెలంగాణ, భారత సంఘాల సహకారంతో సభను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events