Namaste NRI

రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక నిర్ణయం.. కీలక మంత్రిపై

ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. జెలెన్‌స్కీ సేనలు మెరుపు దాడులతో మాస్కో బలగాలను దెబ్బతీస్తున్నాయి. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉప రక్షణమంత్రి జనరల్‌ దిమిత్రి బుల్గకోవ్‌ను ఆ పదవి నుంచి తప్పించారు.  బుల్గకోవ్‌ 2008 నుంచి రష్యా మిలిటరీ లాజిస్టిక్స్‌ నిర్వహణ బాధ్యతలు చూస్తూ వచ్చారు. లాజిస్టిక్స్‌ నిర్వహణలో వైఫల్యం కారణంగానే ఇటీవల ఖర్కివ్‌ ప్రాంతం  నుంచి మాస్కో సేనలు వెనుదిరగాల్సి వచ్చిందన్న విమర్శలు ఉన్నాయి. ఈ కారణంగా పుతిన్‌ బుల్గకోవ్‌ను పదవి నుంచి తప్పించినట్లు చెబుతున్నారు. మిజింట్సేవ్‌, మేరియుపోల్‌ విధ్వంసకుడిగా అపకీర్తి మూటగట్టుకున్నారు. అక్కడి ఆర్ట్‌ గ్యాలరీలు, ప్రసూతి ఆసుపత్రులు, థియేటర్లు ఆయన ఆధ్వర్యంలోనే నేలమట్టమయ్యాయి. బుల్గకోవ్‌ స్థానంలో కర్నల్‌ జనరల్‌ మిఖాయిల్‌ మిజింట్సెవ్‌ను నియమించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events