Namaste NRI

ఎస్వీ కృష్ణారెడ్డి చేతుల మీదుగా గణా ఫస్ట్ లుక్

విజయ్‌కృష్ణ కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం గణా. సుకన్య, తేజు  కథానాయికలు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక వ్యక్తి  కృషి, పట్టుదల, దీక్షే ఈ చిత్రం. విజయ్‌ కృష్ణ నటిస్తూ, దర్శకత్వం వహిస్తూ తనే నిర్మించడం మామూలు విషయం కాదు. ఎంతోమంది సహకారం దీని వెనుక ఉంది. అందరూ ఓ మంచి సినిమా తీయాలనే తలపుతో కలిశారు. తప్పకుండా  మంచి ఫలితం దక్కుతుందనే నమ్మకం ఉంది అన్నారు. విజయ్‌ కృష్ణ మాట్లాడుతూ గతంలో రెండు చిత్రాల్లో హీరోగా నటించాను. నాకిది  మూడో సినిమా. ఎస్వీ కృష్ణారెడ్డి అభిమానిని. ఆయన చేతుల ద్వారా ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌  కావడం సంతోషంగా ఉంది. తొలిసారి నా దర్శక నిర్మాణంలో నేనొక సినిమా చేశా. యాక్షన్‌ ప్రధానంగా సాగే ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. త్వరలోనే చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో శివకృష్ణ, రామారెడ్డి వసల పూడి, రమేష్‌ చందు, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సన్ని, సంగీతం: చినికృష్ణ, లైన్‌ ప్రొడ్యూసర్స్‌: బాల ప్రసాద్‌, ఎమ్‌.యు. ఎస్‌.రెడ్డి, కర్రి బుచ్చిరెడ్డి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events