జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాతో ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షి చర్చల్లో పాల్గొన్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఆ ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. అనేక ప్రాంతీయ, గ్లోబల్ సమస్యలపై ఆ ఇద్దరూ మాట్లాడుకున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. భారత్, జపాన్ వ్యూహాత్మక సంబంధాల గురించి కూడా మాట్లాడుకున్నారు. మాజీ ప్రధాని షింజో అబే పార్దీవదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ జపాన్‌కు వెళ్లారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)