రష్యా ఆక్రమణలో ఉన్న ఉక్రెయిన్ భూభాగాలను తిరిగి కలుపుకుంటామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మరోసారి ప్రతిజ్ఞ చేశారు. నాటో సభ్యత్వ మంజూరు వేగవంతం చేయాలని కోరారు. ఈ మేరకు నాటో సైనిక కూటమిలో చేరేందుకు వేగవంతమైన దరఖాస్తును సమర్పిస్తున్నట్టు వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఇప్పటికే నాటో కూటమి ప్రమాణాలకు అనుకూలంగా ఉన్నామని మేము నిరూపించుకున్నాం. వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్షుడిగా ఉన్నంత కాలం రష్యాతో కీవ్ చర్చలు చేపట్టదు. కొత్త అధ్యక్షుడితోనే సంప్రదింపులు చేపడతాం అని జెలెన్‌స్కీ అన్నారు. ఉక్రెయిన్‌లోని ఖేర్సన్, జపోరిజియా, లుహాన్స్క్, డొనెట్స్క్ ప్రాంతాలను రష్యాలో విలీనం చేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. పుతిన్ ప్రకటన వచ్చిన కొద్ది సేపటికే జెలెన్‌స్కీ ఈ మేరకు వీడియో విడుదల చేశారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)