రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్ నుంచి ఆక్రమించుకున్న డొనెట్క్స్, లుహాన్స్, జపోరిజియా, ఖేర్సన్ ప్రాంతాలను రష్యాలో విలీనం చేసుకుంటున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన విలీన ఒప్పందాలపై ఆయన సంతకం చేశారు. మాస్కోలోని క్రెమ్లిన్ భవంలో జరిగిన కార్యక్రమంలో ఈ నాలుగు రీజియన్లకు సంబంధించిన నేతలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చలకు రావాలని ఉక్రెయిన్ను ఆహ్వానించిన ఆయన విలీన ప్రాంతాలను మాత్రం వదులుకునేది లేదని స్పష్టం చేశారు. ఈ ప్రాంతాలను కాపాడుకోవడానికి దేనికైనా సిద్ధమని పేర్కొన్నారు. బాల్టిక్ సముద్రం కింద రష్యా నిర్మించిన గ్యాస్ పైప్లైన్లను పశ్చిమ దేశాలు ధ్వంసం చేస్తున్నాయని పుతిన్ ఆరోపించారు. రష్యాలో నాలుగు రీజియన్ల విలీనానికి సంబంధించిన ఒప్పందాలను ఆమోదించేందుకు రష్యా ఉభయ సభలు వచ్చే వారం సమావేశం కానున్నాయి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)