Namaste NRI

తానా బంగారు బతుకమ్మ పండుగ

కోటి రతనాల వీణ నా తెలంగాణా అన్నారు. ఎన్నో జాన పద, లలిత కళలకు జన్మ నిచ్చిన రత్న గర్భ తెలంగాణ. ప్రాచీన, సంస్కృతి, నాగరికత లకు జన్మ స్థలి తెలంగాణ.   తెలంగాణ ఉద్యమాలకే కాదు ఉత్సవాలకు పెట్టింది పేరు. తెలంగాణా సంస్కృతి ని చాటి చెప్పే అతి పెద్ద పండుగ బతుకమ్మ పండుగ. అక్టోబర్ 8,న హార్ట్ ఆఫ్ ది యూనివర్స్ గా పిలువ బడే న్యూయర్క్ టైమ్ స్క్వేర్ లో ని డప్పీ స్క్వేర్ లో తానా బతుకమ్మ పండుగను అంగ రంగ వైభవం గా నిర్వహించబోతోంది.

ఈ పండుగను దిగ్విజయం గా నిర్వహించి వేల కిలో మీటర్ల దూరంలో నున్న మనం మాతృ భూమి కీర్తి పతాక ను రెప రెప లాడిద్దాం. మన జీవన మూలాల్లోని అమూల్యమైన పావన విలువల్ని విశ్వ వ్యాప్తం చేద్దాం. రక రకాల పూలతో, బతుకమ్మ ను అలంకరించి ఆట పాట లతో ఆ తల్లిని మనసారా అర్చన చేద్దాం.తరతరాల తెలంగాణా సంస్కృతీ సంప్రదాయాలకు పట్టు కొమ్మ లు గా నిలుస్తున్న సాంస్కృతిక సంస్థలకు, తెలంగాణా ను సకల కళల మాగాణీ గా ప్రపంచ స్థాయిలో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న కళాకారులకు, తెలంగాణ బిడ్డలకు, అభిమానులకు, ఉభయ రాష్ట్రల ప్రజలకు సాదరం, సగౌరవం గా ఆహ్వానిస్తున్నాం.

Pls register for bus facility at timesquare from NJ and NYC. We have 4 bus locations(Floral park,Flushing,Hauppage and Hicksville) in NYC and one in NJ(Edison)

bit.ly/bathukammabusfacility.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events