ఉగాండా రాజధాని కంపాలాలో ‘తెలంగాణా అసోసియేషన్ అఫ్ ఉగాండా’ ఆధ్వర్యంలో , ‘తిరుమల తిరుపతి దేవస్థానం- ఉగాండా’ ప్రాంగణంలో ఘనంగా బతుకమ్మ పండుగ సంబురాలు జరుపుకున్నారు.. ఈ సందర్భంగా మహిళలు లయబద్దంగా బతుకమ్మ పాటలు పాడుతూ.. బతుకమ్మ తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పారు. అనంతరం బతుకమ్మలను పక్కనే ఉన్న కొలనులో వేసి పోయిరావమ్మా బతుకమ్మ పోయిరావమ్మా అంటూ వీడ్కోలు పలికారు. వచ్చే ఏడాది నుంచి బతుకమ్మ సంబురాలను మరింత ఘనంగా నిర్వహిస్తామని అసోసియేషన్ నిర్వాహకులు తెలిపారు. ప్రాంతాలకతీతంగా బతుకమ్మ పండుగ సంబురాలకు చాలా మంది హాజరయ్యారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)