Namaste NRI

ఆకాష్ పూరి క్లాప్ తో ప్రారంభమైన మహీంద్ర పిక్చర్స్

మహీంద్ర పిక్చర్స్‌ పతాకంపై చైతన్య పసుపులేటి, రితిక చక్రవర్తి జంటగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. చిన్న వెంకటేష్‌ దర్శకత్వంలో వి.శ్రీనివాస్‌ రావ్‌ నిర్మాత. తెలుగు, తమిళ్‌ భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ  చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లోని సత్యసాయి కల్యాణ మండపంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన హీరో ఆకాష్‌ పూరి  హీరో హీరోయిన్లపై తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌ కొట్టారు. ప్రొడ్యూసర్‌ రావ్‌ బోయపాటి కెమెరా స్విచాన్‌ చేశారు. అనంతరం చిత్ర దర్శకుడు చిన్న వెంకటేష్‌ మాట్లాడుతూ ఇదొక సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ అని అన్నారు. ఈ మూవీలో లవ్‌, ఫ్యామిలీకి సంబంధించిన అన్ని రకాల ఎలిమెంట్స్‌ ఉంటాయి. ఈ నెల 17 నుండి చీరాలలో మొదటి షెడ్యూల్‌ జరుపుకొని హైదరాబాద్‌లో జరిగే రెండవ షెడ్యూల్‌తో సినిమా పూర్తి చేసుకొంటాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో సుధాకర్‌, స్వరూప్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: సాయికార్తీక్‌ గౌడ్‌, జాడి, కెమెరా: సుధాకర్‌ అక్కినపల్లి: సంగీతం: స్వరూప్‌: హర్ష.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events