ఉక్రెయిన్‌కు చెందిన నాలుగు ప్రాంతాలు రష్యాలో విలీనమైనట్టు పుతిన్ ప్రకటించిన తర్వాత కూడా దాడుల తీవ్రత తగ్గలేదు. ఉక్రెయిన్‌కు గట్టి పట్టున్న జపోరిజాలోని నివాసాలపై మాస్కో విరుచుకుపడిరది. రాకెట్లతో భీకర దాడులకు పాల్పడిరది. ఈ ధాటికి ముగ్గురు మరణించగా, 12 మంది గాయపడ్డారు. దాడుల్లో 40కిపైగా భవనాలు ధ్వంసమయ్యాయి. ఒకటి సూర్యోదయానికి ముందు, మరొకటి ఉదయం క్షిపణి దాడి జరిగిందని పేర్కొన్నాయి. అక్కడికి సమీపంలోని యూరప్‌లోని అతి పెద్ద దైన అణు కార్మాగారం ఉంది. దీంతో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. డొనెట్క్స్, ఖేర్సన్, నిప్రో ప్రాంతాల్లోనూ మాస్కో బలగాలు దాడులకు పాల్పడ్డాయని, ఈ ఘటనలో పది మంది మృతి చెందినట్టు ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయ డిప్యూటీ చీఫ్ కైరి తిమోషెంకో వెల్లడిరచారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)