సాహిత్య నోబెల్ విజేతగా ఫ్రాన్స్కు చెందిన అన్నీ ఎర్నాక్స్ నిలిచారు. లింగం, భాష, తరగతుల మధ్య ఉన్న విభేదాలపై అనేక రచనలు చేశారని కొనియాడుతూ ఆమెకు ఈ బహుమతి ప్రదానం చేస్తున్నట్టు స్వీడిష్ అకాడమీ వెల్లడిరచింది. ఎర్నాక్న్ మొత్తం 20కి పైగా సాహిత్య రచనలు చేశారు. లైంగిక దాడులు, అబార్షన్, అనారోగ్యం, తన తల్లిదండ్రుల మరణంపై ఎక్కడ రాజీపడకుండా రచనలు చేశారని అకాడమీ వెల్లడిరచింది. 1940లో జన్మించిన ఆమె తన 82 ఏండ్ల జీవితంలో సమాజ రుగ్మతలను రూపుమాపేందుకు తన కలానికి పనిపెట్టారు. 1971లో ఆధునిక సాహిత్యంలో పట్టభద్రురాలైన ఆమె తొలినాళ్లలో పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేస్తూ రచనా వ్యాసంగాన్ని ప్రారంభించారు. 1974లో రాసిన లెస్ ఆర్మోయిరెస్ విడెస్ ఆమె తొలి రచన. ఆది ఆమె ఆత్మ కథ. కాకపోతే నవలారూపంలో రాశారు. నోబెల్ బహుమతి దక్కటంపై ఎర్నాక్స్ సంతోషం వ్యక్తం చేశారు.