దేశంలో నెలకొన్న పరిస్థితులు దృష్ట్యా పక్కా విజన్, గట్టి పట్టుదల, దృఢ సంకల్పం ఉన్న కేసీఆర్ నాయకత్వం దేశానికి ఎంతో అవసరమని టీఆర్ఎస్ కువైట్ శాఖ అధ్యక్షుడు అభిలాష గొడిశాల అన్నారు. టీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితిగా అవతరించడం పట్ల ఎన్ఆర్ఐ కువైట్ శాఖ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా అభిలాష గొడిశాల మాట్లాడుతూ ఎనిమిదేళ టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి, పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలతో దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా కేసీఆర్ చేశారని వెల్లడిరచారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి చేసినట్లుగానే భారత్ను కూడా ప్రపంచంలోనే తిరుగులేని దేశంగా తీర్చిదిద్దుతారన్న విశ్వాసం ఉందని ధీమా వ్యక్తం చేశారు. విజయ దశమి రోజున బీఆర్ఎస్ను ప్రారంభించారు కాబట్టి విజయం తథ్యమని అన్నారు. టీఆర్ఎస్ ఎన్నారై కువైట్ కమిటీ తరపున తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)