మునుగోడు ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి గెలుపు కోసం ఆస్ట్రేలియా టీం ప్రత్యేక కార్యాచరణతో పని చేస్తుందని టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ఆస్ట్రేలియాలోని కాన్బెర్రలో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా నాయకులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడాన్ని స్వాగతించారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ దిశా నిర్దేశం ప్రకారం నూతన జాతీయ పార్టీకి సేవలందిస్తామని వెల్లడించారు. సీఎం వెంట నడవాలని ఏసీటీ కన్వినర్ రవి సాయల ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. దేశమంతా తెలంగాణ వైపు చూస్తోందన్నారు. నేడు ప్రతీ రాష్ట్రం తెలంగాణ మోడల్ని కోరుకుంటుందని అభిప్రాయపడ్డారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చే సత్తా సీఎం కేసీఆర్కు మాత్రమే ఉందని దేశ ప్రజలు నమ్ముతున్నారన్నారు. ఈ సమావేశంలో ఝాన్సీ, రాకేష్ లక్కరసు, వీరేందర్, అనిత ఉగ్గం, రమేష్, సుషుత్, శ్రీనివాస్, రుద్ర తదితర సభ్యులు పాల్గొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)