Namaste NRI

ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు : ఆది

ఆది సాయికుమార్ హీరోగా దిగంగన సూర్యవంవీ, మిర్నా మీనన్ నాయకా నాయికలుగా నటిస్తున్న చిత్రం క్రేజీఫెలో. ఫణికృష్ణ సిరికి దర్శకుడు. కె.కె. రాదామోహన్ నిర్మాత. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో ఆది మాట్లాడుతూ క్రేజీ ఫెలో సినిమాకి అన్ని చోట్ల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. మౌత్ టాక్ చాలా బాగుంది అని అన్నారు. రాధామోహన్ మాట్లాడుతూ క్రేజీ ఫెలో విజయం యూనిట్ అందరిది. మా బ్యానర్ ద్వారా ఆదికి మంచి సక్సెస్ ఇచ్చినందుకు హ్యాపీ అన్నారు. మంచి సినిమా వస్తే థియేటర్కి వస్తామని క్రేజీ ఫెలో తో మరోసారి రుజువు చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు అన్నారు ఫణికృష్ణ. మా చిత్రాన్ని ఆదిరస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్ అన్నారు దిగంగనా సూర్యవన్సీÑ మర్ని మీనన్. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events